సెమీస్ లో ఐర్లాండ్ పై టీంఇండియా విక్టరీ

సెమీస్ లో ఐర్లాండ్ పై టీంఇండియా విక్టరీ

సెమీస్ లో ఐర్లాండ్ పై టీంఇండియా విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉమెన్ టీ20 వరల్డ్ కప్ వేటలో ఇండియా మరో అడుగు ముందుకేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీంఇండియా సోమవారం జరిగిన తమ లాస్ట్ లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై 5రన్స్ తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కల్గించే టైంకి ఐర్లాండ్ 54 పరుగులు చేసింది. దీంతో డీఎల్ఎస్ ప్రకారం 5 పరుగుల ఆధిక్యంతో టీంఇండియా గెలిచింది.

మొదట టాస్ గెలిచిన టీంఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మందన ( 56 బంతుల్లో 87, 9 ఫోర్టు, 3 సిక్సులు) అర్ధ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 155/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 8.2 ఓవర్లలో 54/2 స్కోరు చేసింది. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

భారత్ స్కోర్ : 20 ఓవర్లలో 155/6 ( మందన 87, షెఫాలీ వర్మ 27, డెన్లీ 3/33, ప్రెంబన్ గ్రాస్ట్ 2/22),
ఐర్లాండ్ స్కోర్ : 8.2 ఓవర్లలో 54/2 ( లెవిస్ 32 నాటౌట్, డెన్లీ 17 నాటౌట్ , రేణుకాసింగ్ 1/10).