ఈ పాత్రలో నీరు త్రాగితే కిడ్నీలు పదిలం

ఈ పాత్రలో నీరు త్రాగితే కిడ్నీలు పదిలం

ఈ పాత్రలో నీరు త్రాగితే కిడ్నీలు పదిలం

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : చాలా మంది రాగిపాత్రలో నీరు తాగుతారు. రాగిపాత్రలో నీరు తాగితే అనారోగ్య సమస్యలు రావని నమ్ముతుంటారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది. నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ హెల్త్ లైన్ ప్రకారం…రాగి ముఖ్యమైన పోషకం. ఇందులో శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే గుణం ఉంది.

మెదడు రసాయన సందేశ వ్యవస్థను నిర్వహించడం వంటి శరీరానికి అవసరమైన ముఖ్యపాత్రలను రాగి పోషిస్తుంది. షెల్ఫిష్, గింజలు, బంగాళదుంపలు, డార్క్ చాక్లెట్, అవయవ మాంసాలు వంటి ఆహారాలలో మీరు అధిక మొత్తంలో రాగి ఉంటుంది. రాగి మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. రాగి పాత్రలో నీటిని 48 గంటల కంటే ఎక్కువసేపు ఉంచితే నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.ఈ పాత్రలో నీరు త్రాగితే కిడ్నీలు పదిలం

*రాగిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు..
డైటీషియన్లు తెలిపిన వివరాలు ప్రకారం…రాగి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగించడంతో పాటుగా ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాగిపాత్రలో నీరు ఆల్కలీన్‌గా ఉంటుంది. వీటిని తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది.

*పిత్తం, కఫం వంటి సమస్యలు దూరమవుతాయి..
రాగి పాత్రలో నీరు తాగడం వల్ల వాత, పిత్త, కఫాలను నయం చేస్తుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. శరీరంలో నుంచి టాక్సిన్స్ విడుదలై వేడిని ఉత్పత్తి చేస్తుంది. రాగి ఉన్న ఆల్కలీన్ వాటర్ శరీరంలోని యాసిడ్‌ని బ్యాలెన్స్ చేయడంతోపాటుగా శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి రాగి పాత్రలో నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

*ఉదయం ఖాళీ కడుపుతో నీటిని త్రాగాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో రాగి పాత్రలోని నీరు తాగాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇది కాపర్ టాక్సిసిటీని కలిగిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.