త్వరలో డివిజన్ సమస్యలు పరిస్కరిస్తాం: రాజు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 31 వ డివిజన్ లో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యలతో కలిసి స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా 31వ డివిజన్ లో ఉన్న సమస్యలను, పనులను మేయర్, కమిషనర్ లకు స్థానిక కార్పొరేటర్ విన్నవించారు. న్యూ శాయంపేట మెయిన్ రోడ్ వైన్డింగ్ చేస్తూ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మేయర్ ను మరియు కమిషనర్ ని కార్పొరేటర్ రాజు కోరారు.దీనిపై స్పందించిన మేయర్, కమిషనర్ సాధ్యమైనంత త్వరలో రోడ్డు డ్రైవింగ్ చేస్తూ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రెండు రోజుల క్రితం ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన చీఫ్ విప్ సాధ్యమైనంత త్వరలో రోడ్డు వైన్డింగ్ చేసి, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ మామిండ్ల రాజు తెలిపారు.
అదే విధంగా సుజిత్ నగర్ లో పర్యటించి అక్కడున్న పరిస్థితులను మేయర్ , కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మేయర్, కమిషనర్ రూ. 38 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన సుజిత్ నగర్ ప్రజలు మేయర్, కమిషనర్ లకు కార్పొరేట్ మామిండ్ల రాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక స్థానిక ప్రభుత్వ స్కూల్లో ఉన్న సమస్యలను కూడా కార్పొరేటర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. వాటర్ సదుపాయం లేదని చెప్పడంతో వెంటనే మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేయించడం జరిగింది. అదే విధంగా డివిజన్లో ఉన్న స్మశాన వాటికలను కూడా వారు పర్యటించారు.
కనీస వసతులు కూడా లేవు అనే విషయాన్ని మేయర్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యలపై వినతి పత్రం అందచేశారు. డివిజన్లలో పర్యటించడం వల్ల పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సమస్యలు తీరుతాయని కార్పొరేటర్ రాజు అన్నారు. పర్యటనలో భాగంగా వెంటనే డివిజన్లో ఉన్న అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ మామిండ్ల రాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ బానోతు వెంకన్న నాయక్, సీఎంహెచ్ ఓ డా.రాజా రెడ్డి, సిహెచ్ ఓ సుజాత, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, ఈఈ శ్రీనివాస్ రావు, డీఈ సంతోష్ బాబు, ఏఈ అరవింద, సానిటరీ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, జవాన్ ఇంద్రసేన, డివిజన్ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.