హైదరాబాద్: ఇప్పుడు ప్రపంచంలోని ప్రజలందరూ ఎదురుచూస్తోంది కరోనా వ్యాక్సిన్ గురించే అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అనేక కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌పై తన ప్రయోగాలను ముమ్మరం చేశాయి. పలు కంపెనీలు క్లినికల్ ట్రయిల్స్ దశల్లో సక్సెస్ కూడా సాధించాయి. అలాంటి కంపెనీల జాబితాలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా ఉంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌పై సక్సెస్‌ఫుల్‌గా ట్రయిల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోపిక్ కంపెనీ… ఇందుకోసం ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధిస్తున్న భారత్ బయోటెక్… రాబోయే ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐసీఎంఆర్ సైతం కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కంపెనీకి సూచించింది.