ప్రాణం తీసిన ఈత

ప్రాణం తీసిన ఈత

మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగూడ మండలంలోని కౌల్ నారాయణ కుంటకు చెందిన చెరువులో ఈతకు వెళ్ళి నలుగురు యువకులు గల్లంతయ్యారు.ప్రాణం తీసిన ఈతగల్లంతైన వారు కొర్ర తండా గ్రామానికి చెందిన యువకులు కాగా వారిలో కెలావత్ వీరన్న , బానోత్ విజయ్ లు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కొర్ర రాజెందర్ మృతి చెందగా, కొర్ర నరెందర్ పరిస్థితి విషమంగా వుండటంతో అతన్ని స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కొత్తగూడ మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.