కండోమ్స్‌తో చేసిన డ్రెస్ వేసుకున్న ఉపాసన
వరంగల్ టైమ్స్ ,హైదరాబాద్: ఉపాసన..పరిచయం ఏమాత్రం అవసరం లేని డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. హెల్త్, ఫిట్ నెస్ లో నెటిజన్లకు ఎన్నో సలహాలు..సూచనలు చేస్తుంటారు. అంతేకాదు సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుండే ఈ మెగా కోడలు చాలా చాలా వినూత్నమైన అంశాలపై చాలెంజ్ లు చేస్తుంటారు. ఇప్పుడు ఎవ్వరూ ఊహించని అంశంపై చాలెంజ్ చేస్తూ మరోసారి సోషల్ మీడియాలో చాలెంజింగ్ పోస్ట్ పెట్టారు ఉపాసన. తాజాగా డిజైనర్ దుస్తులకు సంబంధించి ఉపాసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. పనికి రాని వాటిని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేస్తూ ఉపాసన తన ఇన్ స్ట్రాగ్రామ్‌లో ..లోకల్ డిజైనర్‌లు రిజెక్ట్ చేసిన డిఫెక్టెడ్ కండోమ్స్, టెక్స్ టైల్ స్క్రాప్‌తో రూపొందించిన డిజైనర్ వేర్‌ను ధరించి ‘సస్టైనబుల్ ఫ్యాషన్‌దే ఫ్యూచర్’ అంటోంది ఉపాసన.