సీనియ‌ర్ న‌టి వాణి శ్రీ ఇంట్లో విషాదం

సీనియ‌ర్ న‌టి వాణి శ్రీ ఇంట్లో విషాదం

చెన్నై:  ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి వాణి శ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వాణిశ్రీ త‌న‌యుడు అభిన‌య్ వెంక‌టేష్ కార్తీక్(36) బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. చెంగల్‌పట్టు జిల్లా బెంగ‌ళూరులోని అన్న‌పూర్ణ మెడిక‌ల్ క‌ళాశాల‌లో అభిన‌య్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గా పని చేస్తున్నారు.  శుక్ర‌వారం రాత్రి కుమారుడితో స‌ర‌దాగా గ‌డిపిన ఆయ‌న ఉద‌యం తిరుక్క‌లికుండ్రంలోని ఫాంహౌస్‌‌లో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే  ఆయ‌న ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. బెంగ‌ళూరులోని అన్న‌పూర్ణ మెడిక‌ల్ క‌ళాశాల‌లో అభిన‌య్ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గా పని చేస్తున్నారు., లాక్ డౌన్ వ‌ల‌న కొద్ది రోజులుగా ఇంటికే పరిమిత‌మ‌య్యారు.  సీనియ‌ర్ న‌టి వాణి శ్రీ ఇంట్లో విషాదంఅభిన‌య్ అనూహ్యంగా మృతి చెంద‌డం కుటుంబ స‌భ్యుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. అభినయ్ సతీమణి కూడా వైద్యురాలే కాగా, ఆమె సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో పని చేస్తోందని స‌మాచారం. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని అంటున్నారు.  అభిన‌య్ మృతిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు. మ‌రోవైపు పోస్ట్ మార్టం కోసం ఆయ‌న‌ని చెంగ‌ల్‌ప‌ట్టు ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు.

కాగా, వాణిశ్రీకి కుమారుడు అభినయ్‌తో పాటు కుమార్తె అనుపమ ఉన్నారు. అభిన‌య్  హఠాన్మరణంతో  వాణిశ్రీ కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగారు .   సినీ ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. అభిన‌య్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు. ముందుగా  అభినయ్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. కాని తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది.