వరంగల్ పోలీసులు గ్రేట్

వరంగల్ పోలీసులు గ్రేట్

వరంగల్ పోలీసులు గ్రేట్వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని ధర్మసాగర్ పోలీసులు కాపాడారు. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన వస్కుల శ్రీనివాస్ గ్రామపంచాయితీ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తుండేవాడు. శ్రీనివాస్ దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. భార్యా భర్తల మధ్య తగాదాలతో భార్య పిల్లలను వదిలి తన తల్లి ఇంటికి వెళ్ళింది. తిరిగి ఇంటికి రావడం లేదు. గత కొన్ని నెలలుగా మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆలోచించిందే తడవుగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని గురువారం రాత్రి సాయిపేట శివారులోని ధర్మసాగర్ చెరువు దగ్గరికి వెళ్లాడు.

చెరువులోకి దూకి పిల్లలతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతుండగా పోలీసుల కంటపడింది. ఓ కేసు విషయమై వేలేరుకు వెళ్లి అటుగా వస్తున్న కాజిపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ రమేష్ లు గమనించి శ్రీనివాస్ ను ఇద్దరు పిల్లలను ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు. రెప్పపాటులో సామూహిక ఆత్మహత్య నుంచి శ్రీనివాస్ , తన ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో పోలీసులు సంతోషపడ్డారు. మనస్థాపానికి గురైన శ్రీనివాస్ కు పోలీసులతో పాటు పిల్లలు ధైర్యం చెప్పారు.