ఐమ్యాక్సా… మజాకా..!

ఐమాక్స్ లో బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ తో అవతార్ 2

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : అత్యాధునిక సాంకేతికతను జోడించి రూపొందించిన అవతార్ 2 సినిమాను అంతే స్థాయిలో ప్రేక్షకులు వీక్షించేలా ప్రసాద్ ఐమాక్స్ సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బార్కోలేజర్ 3డీ గ్లాసెస్ ను ప్రసాద్ ఐమాక్స్ తొలిసారిగా సినీ ప్రియులకు పరిచయం చేయబోతుంది. అందులో భాగంగానే శుక్రవారం ( డిసెంబర్ 16న ) విడుదలవుతున్న అవతార్ 2 సినిమాను చూసేందుకు వచ్చే సినీ ప్రేక్షకులకు ఈ గ్లాసెస్ ను అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఐమ్యాక్సా... మజాకా..!ఈ గ్లాసెస్ ను బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒక్కో గ్లాసెస్ ధర రూ. 4వేలు.అంతేకాదు దేశంలోనే అతిపెద్ద స్క్రీన్.. ప్రపంచంలోనే అతి పొడవైన ఐమాక్స్ తెరపై ఈ సినిమా ప్రదర్శన కాబోతుంది. 630 సీటింగ్ కెపాసిటీతో స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. కెనడాకు చెందిన ప్రొజెక్షన్ స్క్రీన్ తయారీదారు ఆస్ట్రంగ్ ఎండీఐ ద్వారా ప్రసాద్స్ మల్టీపెక్స్ కోసం స్క్రీన్ ప్రత్యేకంగా రూపొందించారు. స్పీకర్లు క్యూఎస్సీ ఆడియో, ప్లేబ్యాక్స్ కోసం, డాల్బీ సీపీ 950 సౌండ్ ప్రాసెసర్ వాడుకలో ఉంటుందని మేనేజర్ మోహన్ కుమార్ పేర్కొన్నారు. మొత్తంగా ఈ 3 డీ గ్లాసెస్ తో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి కలగనుందని తెలిపారు.