టీఎస్ లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు 

టీఎస్ లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : టీఎస్ లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తైన తర్వాత, ఎల్ఎల్ బీ ( మూడేండ్లు), ఎల్ఎల్ బీ( ఐదేండ్ల), ఎల్ ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 3,181 సీట్లు ఖాళీ ఉండగా, 8,987 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 2,836 మందికి సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.

తుది విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు, జాయినింగ్ లెటర్, చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. చలాన్ లో వచ్చిన ఫీజును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో చెల్లించాలని సూచించారు. అనంతరం జాయినింగ్ సర్టిఫికెట్, ఫీజు చెల్లించిన చలాన్ తో సంబంధిత కాలేజీలో డిసెంబర్ 16 నుంచి 21 మధ్యలో రిపోర్టు చేయాలని తెలిపారు.