అసని తుఫాన్ ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : అసని తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయింది. ఏపీలో తుఫాను దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి ఏపీ వెళ్లే 37 రైళ్లను రద్దు చేసింది. ఇందులో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్ మధ్య నడుస్తున్న రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. విశాఖపట్టణం మీదుగా వెళ్లే రైళ్లన్నింటిని అధికారులు రద్దు చేశారు.అసని తుఫాను బాపట్ల, చీరాల మధ్య తీరాన్ని దాటింది. అనంతరం అది కాకినాడ, విశాఖపట్టణం వైపు రూట్ మార్చుకుంది. దీని ఎఫెక్ట్ తో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఏలూరు, విశాఖపట్టణం, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు. తీర ప్రాంతాల్లో 95 నుంచి 105 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.