పేపర్ లీక్ కేసులో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ 

పేపర్ లీక్ కేసులో టీడీపీ నేత నారాయణ అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లో నారాయణ నివాసానికి మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెన్త్ పరీక్షల తెలుగు పేపర్ లీకైన సంగతి తెలిసిందే. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు గుర్తించారు.పేపర్ లీక్ కేసులో టీడీపీ నేత నారాయణ అరెస్ట్ పరీక్ష ప్రారంభమైన తర్వాత ఉదయం 9. 57 గంటలకు వాట్సాప్ లో తెలుగు పేపర్ వైరల్ అయింది. నారాయణ విద్యాసంస్థలో పని చేస్తున్న గిరిధర్ వాట్సాప్ నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇప్పటికీ గిరిధర్ తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.