కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలు

కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలు

వరంగల్ టైమ్స్,హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రం అంతటా బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు రాష్ట్రమంతటా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కేకుల్ కట్ చేశారు. మొదటి రోజు అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రెండో రోజు రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.

సీఎం కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం ఆశ వర్కర్లకు మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరూరి రమేష్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం రక్త దానం చేసిన కార్యకర్తలకు మంత్రి పండ్లు, గుడ్లు, పాలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలుహనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ప్రారంభించారు. మెగా రక్తదాన శిబిరంలో యువకులు, విద్యార్థులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 200 పై చిలుకు రక్తదానం చేసి, సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెష్ తెలిపారు. రక్తదానం చేసిన వారికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పండ్లు పంపిణీ చేసి, సర్టిఫికెట్లను అందచేశారు. తర్వాత హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పని చేస్తున్న 200 మంది కార్మికులకు అన్నదానం చేశారు. అనంతరం కాజీపేట రైల్వే స్టేడియంలో ఆర్టీసీ డ్రైవర్లకు ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. స్వరాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వారికి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ నేతకు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని ఆయన తెలిపారు.కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలుమానవతా మూర్తి సీఎం కేసీఆర్ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా వరంగల్ ఓ సిటి మైదానంలో రక్తదాన శిభిరానికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మహా మృత్యుంజయ సహిత హోమంలో వారు పాల్గొన్నారు. అనంతరం రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలుహనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పరకాల నియోజకవర్గ కేంద్రంలోని పద్మశాలి భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ వరంగల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మోగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులకు, టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే చల్లా పండ్లు అందచేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే చల్లా చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందచేశారు.కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలుకేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. యువతీ, యువకులు, పార్టీ శ్రేణులు స్వచ్ఛంధంగా పాల్గొని మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. 276 యూనిట్ల రక్తదానం ఇచ్చారు. గతంలో కొవిడ్ ప్రారంభసమయంలో నర్సంపేట నియోజకవర్గంలోని యువత, పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల నుండి 7500 యూనిట్ల రక్తాన్ని దానం చేసి రాష్ట్రంలోనే నర్సంపేట నియోజకవర్గం చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతతో స్వచ్చందంగా తరలివచ్చి రక్తదానం చేసిన దాతలందరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో యువత అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.

కేసీఆర్ బర్త్ డే..ఘనంగా రక్తదాన శిబిరాలు