తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి దసరా సెలవులు

తెలంగాణ హైకోర్టుకు రేపటి నుంచి దసరా సెలవులుహైదరాబాద్ : దసరా నేపథ్యంలో హైకోర్టుకు ఈనెల 7 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 18న హైకోర్టులో విచారణలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. అయితే అత్యవసర పిటిషన్లు 8న దాఖలు చేసుకోవచ్చని సూచించారు. వీటిపై 11న ధర్మాసనం విచారణ చేపడుతుందని ఉత్తర్వుల్లో తెలిపారు.