నిర్మాత యన్ యస్ నాయక్ ఆకస్మిక మృతి

నిర్మాత యన్ యస్ నాయక్ ఆకస్మిక మృతి

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : విమర్శకుల చేత ప్రశంసలు పొందిన, హార్మోన్స్ చిత్ర నిర్మాత, గిరిజన సంక్షేమ సమితి వ్యవస్థాపకులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు నూనావత్ సారయ్య నాయక్ గుండె పోటుతో సోమవారం హైదరాబాదులో మరణించారు. ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామానికి చెందిన నూనావత్ సారయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు, నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. సారయ్య మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సారయ్య నాయక్ హఠాన్మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.నిర్మాత యన్ యస్ నాయక్ ఆకస్మిక మృతిసారయ్య నాయక్ సామాజిక కథాంశంతో డా.ఆనంద్ రచన దర్శకత్వంలో 2012 లో హార్మోన్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, డా.డి.రామానాయుడు, డి.టి.నాయక్ తదితరుల ప్రశంసలు పొందింది. తదుపరి డా.ఆనంద్ దర్శకత్వంలోనే బాలికా విద్య, మానవ హక్కులు, మహిళా సాధికారత కథాంశంగా ప్రజా హక్కు, అంటరానితనం, చిరు తేజ్ సింగ్ వంటి లఘు చిత్రాలను నిర్మించి, అభిరుచి కలిగిన నిర్మాతగా పేరొందారు. ప్రముఖ బాలనటులు అవంతికా వందనపు, హాసిని అన్విలను ఈయనే పరిచయం చేశారు. నిర్మాత యన్ యస్ నాయక్ ఆకస్మిక మృతిఆయన మృతి పట్ల దర్శకులు, సామాజిక కార్యకర్త అయిన డా.ఆనంద్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సారయ్య నాయక్ సేవలు, కొత్త వారిని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు వుండే వారని కొనియాడారు.