మృతుల కుటుంబాలకు అండగా శ్రీ శారదా పీఠం

మృతుల కుటుంబాలకు అండగా శ్రీ శారదా పీఠంగుంటూరు జిల్లా : కృష్ణా నదిలో మునిగిపోయి చనిపోయిన వేద విద్యార్థుల కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు విశాఖలోని శ్రీ శారదాపీఠం ముందుకొచ్చింది. విద్యార్థుల మృతిపై విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర విచారం వ్యక్తం చేసి, భావోద్వేగానికి లోనయ్యారు. మృతుల కుటుంబాలకు తమ వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 50వేలు అందచేయనున్నట్లు ప్రకటించారు. ఆ పాఠశాలలోని మిగతా విద్యార్థులను తమ పాఠశాలలో చదివించేందుకు సిద్ధమని స్వామీజి తెలిపారు.