కోడ్ ముగియగానే అధికారుల బదిలీలు

కోడ్ ముగియగానే అధికారుల బదిలీలుహైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న పూర్తయింది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కోడ్ ముగియగానే ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల బదిలీలు ఉంటాయని అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.

కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ ఐఏఎస్​ అధికారుల బదిలీలు ఉంటాయని, అదనపు బాధ్యతల్లో ఉన్న పలు పోస్టులకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఐపీఎస్​ అధికారుల్లో ఎస్పీలు, కమిషనర్లు, సీనియర్ అధికారులను స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది.

సర్కారుకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.