ఆ లింకులను వెంటనే తొలగించాలన్న సమంత

ఆ లింకులను వెంటనే తొలగించాలన్న సమంత

వరంగల్ టైమ్స్, కూకట్ పల్లి : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు..యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌నను పాస్ చేసింది.ఆ లింకులను వెంటనే తొలగించాలన్న సమంతఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి యూట్యూబ్ ఛానెల్స్ చొరబడకూడదని.. ఇష్టమొచ్చినట్లుగా కంటెంట్ పెట్టకూడదని కోర్టు తెలిపింది. అలాగే తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతను కోర్టు సూచించింది.