తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం ఐదుగురు సజీవదహనం

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం ఐదుగురు సజీవదహనంచెన్నై: తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 5 వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శంకరాపురంలోని బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంటల్లో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్.. రెస్క్యూ ఆపరేన్ నిర్వహిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడ పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది.