కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా
వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్ కు వచ్చారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ తో సమావేశం ముగిసిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి అయ్యాక కుటుంబంతో కలిసి ప్రగతి భవన్ కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని రోజా తెలిపారు. ప్రగతి భవన్ కు కుటుంబసమేతంగా వెళ్లిన రోజాకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు కల్వకుంట్ల కవిత కుంకుమ పెట్టి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురిగా చూస్తారని, ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రగతి భవన్ కు వచ్చానని రోజా స్పష్టం చేశారు.