సిరివెన్నెల కన్నుమూత

సిరివెన్నెల కన్నుమూత

వరంగల్ టైమ్స్ ,హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. న్యూమోనియాతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24న హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సీతారామశాస్త్రి అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, త్వరగానే కోలుకుంటున్నారని రెండు రోజుల క్రింద కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి సిరివెన్నెల ఆరోగ్య ఒక్కసారిగా విషమించింది. వైద్య బృందం ప్రతీక్షణం ఆయనను కాపాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయింది.సిరివెన్నెల కన్నుమూత సిరివెన్నెల మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సిరివెన్నెల 1955, మే 20న అనకాపల్లిలో జన్మించారు. వేటూరి సుందర రామ్మూర్తి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటకు గౌరవం తీసుకొచ్చిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. అత్యంత సరళమైన పదాలతో వాడుకభాషలో ఆయన రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి.

సిరివెన్నెల ఇకలేరు అని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కిమ్స్ హాస్పిటల్ కు బయల్దేరారు. ఎలాగైనా ఆయన కోలుకొని రావాలని కోట్లాది మంది చేసిన ప్రార్థనలు వృధా అయిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.