10 కోర్టుల కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీజేఐ

10 కోర్టుల కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీజేఐహనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లాలోని 10 కోర్టుల భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 10 కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ బుయాన్, రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, వరంగల్ జిల్లా జడ్జి ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, పలువురు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.10 కోర్టుల కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీజేఐ

10 కోర్టుల భవన సముదాయంలో సీనియర్ సివిల్ న్యాయస్థాన హాలు పోక్సో కోర్టుగా మార్చారు. లైంగికదాడుల కేసుల్లో విచారణకు వచ్చేవారు కనపడకుండా ఏర్పాట్లు చేశారు. చిన్నారులు, తల్లిదండ్రులు, కక్షిదారులు కనపడకుండా ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేశారు. విచారణ కోసం ప్రత్యేక గదులను అందుబాటులోకి తెచ్చారు. ప్రవేశ మార్గం వద్ద ఆకట్టుకునే రీతిలో కాకతీయ కళాతోరణం, కోర్టులోనికి వెళ్లే మార్గంలో పూల మొక్కలు, సందేశాత్మక చిత్రాలను డిజైన్ చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటు చేశారు.