భద్రకాళీని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

భద్రకాళీని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణహనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఎన్వీ రమణ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని రమణ చీఫ్ జస్టిస్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఎన్వీ రమణ దంపతులకు ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వచనం ఇచ్చారు.భద్రకాళీని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి హనుకొండలోని ఎన్ ఐటీలో శనివారం రాత్రి బస చేశారు. సీజేఐ పర్యటన దృష్ట్యా ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం బహుకరించిన స్వర్ణ కిరీటం, జటామకుటాలను శనివారం అమ్మవారికి అలంకరించారు. శనివారం డీసీపీ పుష్ప, శాంతిభద్రతల అదనపు డీసీపీ సాయిచైతన్య, ఏసీపీ గిరికుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.