సింగర్ మౌనిక యాదవ్ తో చిట్ చాట్

సింగర్ మౌనిక యాదవ్ తో చిట్ చాట్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : తన అక్క పద్మావతి చిన్నప్పటి నుంచి జానపద పాటలు పాడేది. అక్క పాటలు పాడేందుకు వెళ్తుంటే అక్క వెంట వెళ్తూ అక్కను అనుసరిస్తుండేది. దీనికి తోడు అమ్మానాన్నల ప్రోత్సాహం తోడైంది. క్రమంగా పాటలు పాడటంపై ఇష్టం ఏర్పర్చుకుంది. స్వగ్రామం కనిపర్తిలో 2009లో ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమంలో ‘గోదారి గోదారీ ఓహో పారేటీ గోదారీ సుట్టూ నీళ్లున్న సుక్కా దక్కని ఎడారి ఈ భూమి.. మాదీ తెలంగాణ భూమీ’ అనే ఉద్యమగీతం పాట ద్వారా గాయనిగా తొలిసారి ఆమెకు అవకాశం దక్కింది.

అలా తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రమంతా తిరిగి అనేక పాటలు పాడింది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక “తెలంగాణ సాంస్కృతిక సారథి”లో ఉద్యోగం పొందింది. ఆమె ఎవరో కాదు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన ఫోక్ సింగర్ మౌనిక యాదవ్.. జానపద గాయనిగా మంచి గుర్తింపునందుకున్న మౌనికకు సినిమాలో కూడా అవకాశం వచ్చింది. 2021లో పుష్ప సినిమాలో మౌనిక పాడిన ‘సామీ..సామీ..’ పాట ద్వారా మంచి గుర్తింపునందుకుంది. సామి..సామి పాటతో ఫేమ్ అయిన మౌనిక యాదవ్ వరంగల్ టైమ్స్ తో ముచ్చటించింది. తనకు పుష్ప సినిమాలో అవకాశం ఎలా వచ్చింది.. భవిష్యత్ తో తన ఆలోచనలు ఏంటి.. జానపద గాయనిగా తను ఎలా ముందుకు వెళ్లాలనుకుంటుందో వరంగల్ టైమ్స్ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది.