అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య మృతి

అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య మృతిహనుమకొండ జిల్లా : లెజెండరీ స్పోర్ట్స్ మన్, అర్జున అవార్డు గ్రహీత బాల్ బ్యాడ్మింటన్ జమ్మలమడక పిచ్చయ్య(104) ఆదివారం మృతి చెందారు. గత మూడ్రోజులు స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. హన్మకొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్న తన మేనల్లుని ఇంట్లో ఉంటున్న పిచ్చయ్య స్వల్ప అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యుల సమాచారం.

డిసెంబర్ 21న 103 వసంతాలు పూర్తి చేసుకుని 104 ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టారు పిచ్చయ్య. ఆ రోజుల్లోనే రెండు దశాబ్దాల పాటు బాల్ బ్యాడ్మింటన్ లో తన సత్తా చాటిన లెజండరీ స్పోర్ట్స్ మన్ జమ్మలమడక పిచ్చయ్య. పిచ్చయ్య మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య మృతితో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.