కూతురు మరణవార్త విని ఆగిన కన్నతల్లి గుండె

కూతురు మరణవార్త విని ఆగిన కన్నతల్లి గుండెములుగు జిల్లా : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. 12 గంటల వ్యవధిలోనే తల్లి, కూతురు మృతి చెందారు. మొర్రివానిగూడెంకు చెందిన 50 ఏళ్ల దేవమ్మ కూతురు దీపప్రియ నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణించిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని దేవమ్మ గుండె ఆగిపోయింది. 12 గంటల వ్యవధిలోనే తల్లీ కూతుర్లిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.