విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతి

విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతివిద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకు మృతి

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుమ్లా తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి తండ్రీ కొడుకులు మృతి చెందారు. తండ్రి ఆంగోత్ నాయక్ (55), కొడుకు ఆంగోత్ కిరణ్ (29) లు తమ మొక్కజొన్న పంటకు కోతుల నుండి రక్షణ కల్పించేందుకై విద్యుత్ వైర్లు అమర్చారు. అయితే అదే క్రమంలో ప్రమాదవశాస్తూ విద్యుత్ వైర్లు వారిద్దరిపై పడ్డాయి.

విద్యుత్ షాక్ తో తండ్రీ, కొడుకులిద్దరూ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దీంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. దుమ్లా తండాలో విషాదం చోటుచేసుకుంది. కోతుల నుంచి రక్షణ కొరకు పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ తీగలు, తమ కుటుంబసభ్యుల ప్రాణాలను హరించాయని బాధిత కుటుంబసభ్యులు కన్నీళ్లపర్యంతమవుతున్నారు.