గన్నవరంలో టెన్షన్ టెన్షన్ 

గన్నవరంలో టెన్షన్ టెన్షన్

గన్నవరంలో టెన్షన్ టెన్షన్ వరంగల్ టైమ్స్,కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లాలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని నిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధ్వంసం చేసి తగులబెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. గన్నవరంలో 144 సెక్షన్ విధించారు. నిందితులను వదిలి నిరసనలకు రెడీ అయిన టీడీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేయడంతో పాటు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై టీడీపీ డీజీపీని ఆశ్రయించింది.

నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బోండా ఉమ, బుద్దా వెంకన్న వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరంలో అక్రమ కేసుల్లో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ని నాగాయలంక పీఎస్ కు తరలించారు. దీంతో నాగాయలంకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడ్వకేట్ లక్ష్మీనారాయణను మచిలీపట్నం డీఎస్పీ ఆఫీస్ లో ఉంచారు. గన్నవరంలో అరెస్ట్ చేసిన తెలుగు మహిళలను మచిలీపట్నం తరలించారు. మంగినపూడి బీచ్ సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు మహిళలను తరలించారు. ఇక టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇక పట్టాభిరామ్ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. గంటలు గడుస్తున్నా పోలీసులు మాత్రం పట్టాభి ఆచూకీ చెప్పడం లేదు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.