ఆరూరి రమేశ్ కు గడ్డుకాలం ! 

ఆరూరి రమేశ్ కు గడ్డుకాలం !

ఆరూరి రమేశ్ కు గడ్డుకాలం ! 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు గడ్డుకాలం తప్పదా ? ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన కొంప ముంచనుందా? గులాబీ శ్రేణులు ఆయనకు దూరం జరుగుతున్నారా ? ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత మొదలైందా ? అంటే ఔననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

*నాడు కలిసొచ్చింది.. నేడు లైట్ తీసుకుంటున్నాడు..
ఆరూరి రమేశ్ 2014లో కేసీఆర్ బొమ్మతో గెలిచారు. టీఆర్ఎస్ హవా ఉండడంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ప్రభుత్వం నుంచి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే అమలయ్యాయి. దాంతో 2018లో ఆరూరి రమేశ్ కు మరోసారి కలిసి వచ్చింది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో మంచి మెజార్టీతో ఆరూరి విజయదుందుభి మోగించారు. కానీ అక్కడే ట్విస్ట్ వచ్చింది. రెండోసారి గెలిచినంక ఆరూరి ఎవ్వరినీ లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర సామాజికవర్గాలకు చెందిన నేతలను ఆయన లైట్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం గులాబీ క్యాడర్ లో నెలకొంది.

*ఆరూరికి మొదలైన గడ్డు పరిస్థితులు..
ఒకప్పుడు రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచిన ఆరూరి రమేశ్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయట. ఆరూరి ప్రస్తుతం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. సామాజికవర్గ కోటాలో ఆయనకు పార్టీ పెద్దలు ఈ బాధ్యతలు అప్పగించారట. కానీ ఆరూరి రమేశ్ మాత్రం దాన్ని ఇంకో రకంగా భావిస్తున్నారట. ఇక తనకు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ ఎదురులేదని సన్నిహితులతో గొప్పగా చెప్పుకుంటున్నారని టాక్. ఈ విషయం ఆనోటా, ఈ నోటా పార్టీ హైకమాండ్ వరకు చేరిందని ప్రచారం జరుగుతోంది.ఆరూరి రమేశ్ కు గడ్డుకాలం ! * సర్వేలో ఆమడ దూరంలో ఆరూరి
బీఆర్ఎస్ లైన్ ను దాటి వ్యవహరించే నాయకులకు పార్టీ అధిష్టానం పెట్టే వాతలు చాలా గట్టిగా ఉంటాయి. ఆరూరి రమేశ్ కూడా కొంతకాలంగా పార్టీ లైన్ ను దాటి మాట్లాడటం, ప్రజలను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఆరూరి రమేశ్ కు పార్టీ పెద్దలు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల బీఆర్ఎస్ జరిపిన సర్వేల్లోనూ ఆరూరి బాగా వెనకబడినట్లు టాక్. ఆరూరికి పాస్ మార్కులు కూడా రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

* వన్ సైడ్ వ్యవహారమే కొంపముంచేట్లు ఉంది !
ఆరూరి వైఫల్యం వెనుక పలు కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ దందాలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. తనకు ఎదురులేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారట. అంతేకాదు అన్నివర్గాలకు భరోసా ఇవ్వాల్సిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అస్సలే లెక్కచేయడం లేదట. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు ఆరూరి రమేశ్ పై కోపంగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సొంత సామాజికవర్గాన్ని కూడా పట్టించుకోకుండా కొందరికి మాత్రం ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారట. ఇక ఆరూరి హయాంలో బీసీలకు సంక్షేమ పథకాల్లో చాలా వరకు అన్యాయం జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. అందుకే ఆ వర్గాలు వర్ధన్నపేటలో ఇప్పుడు వేరే పార్టీల వైపు చూస్తున్నాయన్న టాక్ నడుస్తోంది.

* కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆరూరికి గట్టి పోటే ఉందట !
తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఆరూరి రమేశ్ కు చేదు అనుభవం తప్పదన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఆరూరి రమేశ్ కు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఉండొచ్చని టాక్. ఆ పార్టీలు సొంతంగా తప్పులు చేయకపోతే తప్ప బీఆర్ఎస్ తరపున ఆరూరి గట్టెక్కే పరిస్థితి లేదన్న ప్రచారం జరుగుతోంది. ఏం చేసినా ఆరూరి రమేశ్ కు మూడో స్థానమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేటలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.

ఆరూరి రమేశ్ కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమేనని గులాబీ క్యాడర్ కూడా గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం. అయితే రానున్న ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు ఆరూరి రమేష్ కి జై కొడతారా లేదా వేరే పార్టీలకు జై కొడతారో వేచి చూడాల్సిందే.