మెరుగవుతున్న విద్యార్థుల హాజరు శాతం

మెరుగవుతున్న విద్యార్థుల హాజరు శాతం

హైదరాబాద్ : తెలంగాణలో పాఠశాలలు పున:ప్రారంభమైన తరుణంలో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు మెరుగవుతున్నది. అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 40.42 శాతం విద్యార్థుల హాజరు నమోదు కాగా, అతి తక్కువగా మేడ్చల్ జిల్లాలో 17.26 శాతం హాజరు నమోదైంది. రెండో రోజైన గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో 38.82 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 15.4 శాతం విద్యార్థులు హాజరవగా, ప్రైవేట్ పాఠశాలల్లో 21.74 శాతం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులను విన్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి రెండో రోజు 28.12 శాతం విద్యార్థులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.