30వ డివిజన్ లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

30వ డివిజన్ లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు

హనుమకొండ జిల్లా : దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంఖుస్థాపన మరియు పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాలను నిర్వహణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా పండుగను ఘనంగా ప్రారంభించారు.

రాష్ట్రంలోని పల్లెపల్లెనా, వాడవాడనా టీఆర్ఎస్ శ్రేణులు జెండాలను ఎగురవేసి, సంబురాలు నిర్వహించాయి. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 30వ డివిజన్ లో ఘనంగా గులాబీ జెండా పండుగ నిర్వహించారు. 30వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పొడిశెట్టి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మూడు చోట్ల జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్, సీనియర్ అడ్వకేట్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, విచ్చేసి జెండా పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బూతు కన్వీనర్లు, బూతు కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు నారాయణ సెలవాజీ రవీందర్ రావు, మైసయ్య, కొమురవెల్లి శ్రీనివాస్, సౌరం రఘు, జూకంటి లక్ష్మణ్, జంగిలి విజేందర్, చంద్రమౌళి, కృష్ణ, సాయి కుమార్, రమేష్, రంజిత్, రాజు, స్వామి, ప్రకాష్, సుధాకర్, సంతోష్, రజనీకాంత్ రెడ్డి, ఆలకుంట అశోక్ , సిహెచ్ రాజు, బి శంకర్, డాన్స్ ప్రశాంత్, జి రా,జు యాదగిరి, పి సురేష్, సిహెచ్ మౌనిక, స్వర్ణ సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.