దేశంలో కొత్తగా 47వేల కేసులు

దేశంలో కొత్తగా 47వేల కేసులున్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. రోజూవారీ కేసులతో పాటు మరణాలు పెరిగాయి. నిన్న 41 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, తాజాగా 47వేలకు పైగా రికార్డయ్యాయి. గడిచిన 24గంటల్లో 47,092 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. తాజాగా 35,181 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 509 మంది మృత్యువాతపడ్డారు.

కొత్త కరోనా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. 3,20,28,825 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ బారినపడి 4,39,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3,89,583 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్ లో భాగంగా 66,30,37,334 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.