తెలంగాణలో ఆల్ ఇంటర్ స్టూడెంట్స్ పాస్

తెలంగాణలో ఆల్ ఇంటర్ స్టూడెంట్స్ పాస్హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విద్యార్థి సంఘాల ఆందోళన దృష్ట్యా ఇంటర్ విద్యార్థులనందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. కోవిడ్ తో విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదురుకుందన్నారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తూన్నామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.