ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతంశ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉదయం చెక్ చొలాన్ ఏరియాలో ఉగ్రవాదులు తారసపడటంతో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ కౌంటర్ కొనసాగుతూనే ఉంది. భద్రతా బలగాల కాల్పుల్లో ఉదయమే ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యారు. మధ్యాహ్నం మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు.

దీంతో ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల సంభ్య మూడుకు చేరింది. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయినప్పటికీ ఆ ఏరియాలో ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారేమో అనే అనుమానంతో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.