ఒమిక్రాన్ రిస్క్ జాబితాలో 354 మందికి కరోనా !

ఒమిక్రాన్ రిస్క్ జాబితాలో 354 మందికి కరోనా !ఢిల్లీ : ‘ఒమిక్రాన్’ కలకలం దృష్ట్యా భారత ప్రభుత్వం..పలు దేశాలను రిస్క్ దేశాల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. ఈ దేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు చేయడంతో పాటు, జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా కచ్చితంగా చేయిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్న దేశాల నుంచి బుధవారం పలువురు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ దేశాల నుంచి మొత్తం 394 మంది బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చారని అధికారులు వెల్లడించారు. వీరిలో 40 మంది పిల్లలున్నారని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లు అంతకంటే తక్కువ వయసున్న ఈ చిన్నారులకు కరోనా టెస్టుులు చేయలేదని వారు చెప్పారు. మిగిలిన 354 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్యశాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 7100 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.