చీఫ్ విప్ కు కార్పొరేటర్ రాజు న్యూ ఇయర్ విషెష్

చీఫ్ విప్ కు కార్పొరేటర్ రాజు న్యూ ఇయర్ విషెష్హనుమకొండ జిల్లా : ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత వారం రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇటీవలే హనుమకొండ జిల్లాకు చేరుకున్నారు.

మంగళవారం హనుమకొండకు చేరుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగానే గురువారం రోజు బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.

చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కి పూల మొక్క అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చీఫ్ విప్ ని కలిసిన వారిలో కార్పొరేటర్ రాజుతో పాటు నాగబోయిన బాబురావు, పిండి రాజు, ఆరేళ్ల కిరణ్, ఎనబోతుల సతీష్, అభిలాష్, రమేష్ , క్రాంతి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.