4వ రోజు ఆటకు వర్షం బ్రేక్

4వ రోజు ఆటకు వర్షం బ్రేక్జోహన్నస్ బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో 4వ రోజు వర్షం ఆటంకం కల్గించింది. దీంతో ఆట ఆలస్యమవుతోంది. ప్రస్తుతం జోహన్నస్ బర్గ్ లో స్వల్ప స్థాయిలో వర్షం కురుస్తోంది. గ్రౌండ్ పై నిలిచిన నీటిని సూపర్ సోపర్లతో తొలగిస్తున్నారు. అయితే లంచ్ బ్రేక్ టైం వరకు ఆట ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రెండవ టెస్టు రసపట్టుగా ఉంది.

240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడు రోజుల ఆట ముగిసే టైంకి 2 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. ఇందులో ఎల్గర్ 46, రసీ వాండర్ 11 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు. ఒకవేళ ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే మిగితా 8 వికెట్లను త్వరగా తీయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా తన గెలుపు కోసం 122 పరుగులు చేయాలి.