పరిసరాలను పరిశుభ్రం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

పరిసరాలను పరిశుభ్రం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రత కోసం పది నిమిషాలు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు,రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్తన నివాసంలోని గార్డెన్ లో నీటి నిల్వలు లేకుండా చేసి, మొక్కల వద్ద మట్టిని తవ్వి మొక్కలు సజావుగా పెరిగేటట్లు గార్డెనింగ్ చేశారు.రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.