వరంగల్: వ్యాధుల నివారణకు పరిసరాల పరిశుభ్రతే ముఖ్యమని వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతీ ఒక్కరూ ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కేటాయించాలని రాష్ట్రమంత్రి కే.టీ.ఆర్ ఇచ్చిన పిలుపును ఉమ్మడివరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు తూచాతప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు గ్రేటర్ వరంగల్ లోని 6వ డివిజన్ జక్కలొద్ది హరిజనవాడలో నిర్వహించిన “ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం”లో పాల్గొన్నారు. స్థానికులకు కరపత్రాలు పంచుతూ వ్యాధులు రాకుండా ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేస్తూ విస్తృత ప్రచారం కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశరావు తో పాటు స్థానిక డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.