నా సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరు: నన్నపునేని

నా సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరు: నన్నపునేని

వరంగల్ అర్బన్ : విపత్కర పరిస్థితుల్లో పేదల కడుపు నింపడాన్ని కొందరు రాజకీయం చేయడం సిగ్గుచేటుగా వుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మండిపడ్డారు. లాక్ డౌన్ లో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిరుపేదలకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నిత్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే 9వ డివిజన్ నిరుపేదలకు స్థానిక ఎస్టీ ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.నా సంకల్పాన్ని ఎవరూ దెబ్బతీయలేరు: నన్నపునేనికాశీబుగ్గలోని నరేంద్ర నగర్ పాఠశాలలో 13వ డివిజన్ నిరుపేదలకు, కాశిబుగ్గలోని వివేకానంద కాలేజ్ లో 16 వ డివిజన్ నిరుపేదలకు, మరియు మరియు స్టేషన్ రోడ్ లోని రాదాకృష్ణ గార్డెన్ లో 17 వ డివిజన్ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణి చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి కే.టీ.ఆర్ . పిలుపుమేరకు ప్రతీ ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంను 22వ డివిజన్ డీకే నగర్ గుడిసెల పరిసరప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే నన్నపునేని రాజకీయాలను, పేదలనుద్ధేశించి మాట్లాడారు.

పేదలకు సేవ చేయడం నిజమైన సంతృప్తి నిస్తుందని,కరోనా విపత్తు సమయంలో పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.ఇప్పుడు దగ్గరలో ఎన్నికలూ లేవు, రాజకీయాలకు సమయం కుడా కాదు,పేదలకు సేవ చేస్తుంటే కొందరి కండ్లు మండుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎవరేం అనుకున్నా మా సంకల్పాన్ని దెబ్బతీయలేరని హెచ్చరించారు. నరేందర్ అనే వ్యక్తి పేదరికం నుండి వచ్చిన వ్యక్తి అని,పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని, పేదలకు ఏ కష్టం రానివ్వకుండా చూస్తానని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, డివిజన్ అద్యక్షులు మర్రి శ్రీనివాస్, ఇంచార్జ్ సునీల్, సీబీసి చర్చ్ అద్యక్షుడు సాల్మాన్,టీఆర్ఎస్ నాయకులు మల్లేశం, చిన్న, పటేల్, ఉమేష్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు దాతలు పాల్గొన్నారు.