8 జిల్లాలకు సహాయ కలెక్టర్ల నియామకం

8 జిల్లాలకు సహాయ కలెక్టర్ల నియామకం

హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్‌లను శిక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1. కర్నాటి వరుణ్‌రెడ్డి-

2. ఖమ్మం, చిత్రమిశ్రా-

3. నాగర్‌కర్నూల్‌, పాటిల్‌

4.హేమంతకేశవ్‌-కామారెడ్డి,

5. గరిమా అగర్వాల్‌-యాదాద్రి

6. భువనగిరి, దీపక్‌ తివారి- సిద్దిపేట,

7. ప్రతిమాసింగ్‌-నల్గొండ,

8. అంకిత్‌-కరీంనగర్‌, రిజ్వాన్‌

9. బాషా షేక్‌- రాజన్న సిరిసిల్ల

8 జిల్లాకు సహాయ కలెక్టర్లుగా నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో శనివారం వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించగా.. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య, విశ్రాంత ఐఏఎస్‌ ఏకే గోయల్‌ తదితరులు హాజరయ్యారు. మరోవైపు, సహాయ కలెక్టర్లుగా నియమితులైన ఎనిమిది మంది ఐఏఎస్‌లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎస్‌ వారిని అభినందించారు.