వరంగల్ తూర్పున ఉదయించబోతున్న రవి? 

వరంగల్ తూర్పున ఉదయించబోతున్న రవి?

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : వరంగల్ తూర్పులో రాజకీయం రసవత్తరంగా మారింది.

వరంగల్ తూర్పున ఉదయించబోతున్న రవి? 

* నన్నపునేని నరేందర్ కు చెక్ తప్పదా ?
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు బీఆర్ఎస్ టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో గులాబీ శ్రేణుల నుంచి ఒక ప్రముఖ నాయకుడి పేరు బలంగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ బరిలోకి దిగుతున్న తరుణంలో ఆ ఇద్దరికీ ధీటైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ హైకమాండ్ వెదుకులాడుతోందని సమాచారం. నన్నపునేని నరేందర్ కు చెక్ చెప్పి, మరో బలమైన నాయకుడి అన్వేషణలో గులాబీ పెద్దలు ఉన్నట్లు టాక్. వరంగల్ తూర్పులో 2009 నుంచి ఇప్పటివరకు ఎవరో రెండోసారి గెలవలేదు. ఆ సెంటిమెంటు ద్రుష్ట్యా కూడా బీఆర్ఎస్ పెద్దలు మరో ఆలోచన చేస్తున్నట్లు గులాబీశ్రేణులు చెబుతున్నారు.

* తెరపైకి వద్దిరాజు రవిచంద్ర !
బీఆర్ఎస్ నుంచి నన్నపునేని నరేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రజల్లో ఆయనకు అంత సానుకూల వాతావరణం కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉందట. అంతేకాదు కాంగ్రెస్, బీజేపీలు బలమైన అభ్యర్థులను నిలబెడుతున్న తరుణంలో హిట్ కొట్టాలంటే కచ్చితంగా నరేందర్ స్థానంలో బీఆర్ఎస్ తరపున బలమైన నాయకుడి అవసరం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఆ నాయకుడు ఎవరని హైకమాండ్ అన్వేషిస్తున్న తరుణంలో ఓ పేరుపై గులాబీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన వచ్చిందట. ఆ నాయకుడు మరెవరో కాదు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే వార్ వన్ సైడ్ ఖాయమని గులాబీ శ్రేణులు హైకమాండ్ కు విన్నవించినట్లు టాక్. ఆర్థిక, అంగబలంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించగల సత్తా ఉందని ఆయనకే ఉందని పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు సమాచారం.వరంగల్ తూర్పున ఉదయించబోతున్న రవి? * వద్దిరాజుకు సానుకూల వాతావరణం !
వద్దిరాజు రవిచంద్ర 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. వరంగల్ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఓట్లు సంపాదించారు. రెండో స్థానంలో నిలిచి, తన సత్తాను చాటారు. అంతేకాదు అక్కడ ఓటమి ఎదురైనప్పటికీ వరంగల్ తూర్పుతో వద్దిరాజుకు మంచి అనుబంధమే ఉంది. అక్కడ ఇప్పటికీ ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వద్దిరాజుకు తెలిసిన క్యాడర్ చాలామందే ఉన్నారు. అర్థరాత్రి, అపరాత్రి ఎవరు ఫోన్ చేసినా వద్దిరాజు రవిచంద్ర నేనున్నానంటూ ఆదుకుంటారు. వరంగల్ తూర్పులో ఇప్పటికే ఆయన ఎంతో మందిని ఆదుకున్నారు. తాను రాజ్యసభ ఎంపీ అయినప్పటికీ వరంగల్ తూర్పుతో అదే అనుబంధాన్ని కొనసాగిస్తున్నారాయన. అందుకే వరంగల్ తూర్పులో వద్దిరాజు రవిచంద్రకు సానుకూల వాతావరణం ఉంది. నన్నపునేని నరేందర్ ప్లేసులో వద్దిరాజుకు టికెట్ ఇస్తే గెలుపు లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* వద్దిరాజు వైపే తూర్పుల ప్రజల చూపు !
వరంగల్ తూర్పులోని అన్నివర్గాల జనం కూడా ఆయన ఎమ్మెల్యే అయితే బావుండని కోరుకుంటున్నారు. ఈ విషయం హైకమాండ్ ద్రుష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే నన్నపునేని పనితీరుపై బీఆర్ఎస్ హైకమాండ్ సర్వే చేయించినట్లు టాక్. అందులో నన్నపునేని బాగా వెనుకబడినట్లు సమాచారం. ఆ సర్వేలో నరేందర్ కు సరైన ప్రత్యామ్నాయంగా వద్దిరాజు రవిచంద్రను జనం కోరుకున్నారట. మెజార్టీ జనం వద్దిరాజు ఎమ్మెల్యే అయితే బావుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

* హైకమాండ్ చూపు వద్దిరాజు వైపు ?
అన్నింటికంటే ముఖ్యంగా వరంగల్ తూర్పులో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, బీజేపీ నుంచి ప్రదీప్ రావు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే ఆస్థాయిలో బలమైన నేత కచ్చితంగా వద్దిరాజు రవిచంద్ర అనే మాట బలంగా వినిపిస్తోంది. వద్దిరాజు రేసులో నిలిస్తే తప్ప వరంగల్ తూర్పు బీఆర్ఎస్ వశం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి మంచి స్ట్రేచర్ ఉన్న వద్దిరాజు రవిచంద్రవైపు హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు.వరంగల్ తూర్పున ఉదయించబోతున్న రవి? 

* బీజేపీ, కాంగ్రెస్ లో కలవరం !
నన్నపునేని నరేందర్ ను పక్కనబెట్టి వద్దిరాజు రవిచంద్రకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే వరంగల్ తూర్పుకు చెందిన ముఖ్య నేతలు హైకమాండ్ ను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు జిల్లాకు చెందిన ముఖ్య నేతల అభిప్రాయం ఇదేనని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వరంగల్ తూర్పు నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలపై వద్దిరాజు రవిచంద్ర కూడా సానుకూలంగా ఆలోచిస్తున్నారట. ఒకవేళ వరంగల్ తూర్పు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమని సంకేతాలిచ్చారట. దీంతో హైకమాండ్ చూపు ఆయన వైపే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు పేరు రేసులోకి రావడంతో బీజేపీ, కాంగ్రెస్ లో అప్పుడే కలవరం మొదలైందన్న మాట వినిపిస్తోంది.

* త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్న బీఆర్ఎస్ పెద్దలు !
వరంగల్ తూర్పుపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలు త్వరలోనే ఓ క్లారిటీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప వరంగల్ తూర్పు నుంచి వద్దిరాజు రవిచంద్ర పోటీచేయడం ఖాయమేనని గులాబీశ్రేణులు చెబుతున్నారు. ఆయన తప్ప మరెవరూ పోటీచేసినా వరంగల్ తూర్పులో బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టలేమన్న వాదన వినిపిస్తున్నారట. మరి హైకమాండ్ నిజంగానే నన్నపునేని నరేందర్ కు చెక్ పెడుతుందా? నరేందర్ స్థానంలో వద్దిరాజుకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా? వద్దిరాజు పోటీలో నిలిస్తే వార్ వన్ సైడేనా? అన్నది చూడాలి.