11 నుంచి 14 వరకు పవన్ ఏపీ పర్యటన
వరంగల్ టైమ్స్, మంగళగిరి : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఈనెల 11న మంగళగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. 14న మధ్యాహ్నం మచిలీపట్నంలో జనసేన ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
14న సాయంత్రం మచిలీపట్నంలో నిర్వహించే జనసేన 10వ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో హాజరుకానున్నారు. 34 ఎకరాల్లో సభ కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే ఈ సభకు పార్టీ శ్రేణులు భారీ జన సమీకరణ చేయనున్నారు.