మార్చి 15 నుండి ఇంటర్ పరీక్షలు

మార్చి 15 నుండి ఇంటర్ పరీక్షలు

మార్చి 15 నుండి ఇంటర్ పరీక్షలువరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : మార్చి 15 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు ఐడిఒసి కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు చేపట్టాల్సిన పనుల మీద సమీక్షించారు. మార్చి 15 నుండి ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడుతున్నందున అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి 6797, రెండవ సంవత్సరం నుంచి 6148 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. జిల్లాల్లో 26 పరీక్షా కేంద్రాల ద్వారా విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్ టీములు, ఒక జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ టీమ్ పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు.

పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, ఎమ్మార్వోలు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సూచించారు. వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పి షాకీర్ హుస్సేన్, డిఈఐఓ జాకైర్ హుస్సేన్, సూపర్డెంట్ రమేష్ రెడ్డి, ఏఓ సాయినాథ్ రెడ్డి, డీఈఓ రవీందర్, పోస్టల్ అధికారి, ఆర్టిసి అధికారి, విద్యుత్ అధికారి కమ్యూనికేషన్ అధికారులు, డిపిఆర్ఓ రషీద్ పోలీస్ అధికారులు , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు