ఎనిమల్ అడాప్షన్ లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి : దాస్యం

ఎనిమల్ అడాప్షన్ లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి : దాస్యంహనుమకొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా హంటర్ రోడ్డులోని జూ పార్క్ ను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. జూ పార్క్ లోని వన్యప్రాణుల సంరక్షణపై పలు విషయాలను సంబంధిత అధికారులతో చీఫ్ విప్ సమీక్షించారు.

ఎనిమల్ అడాప్షన్ (దత్తత)లో భాగంగా ఒక్కొక్కరు ఒక్క జంతువును దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని దాస్యం వినయ్ భాస్కర్ నగరవాసులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న 50 ఎకరాల జూపార్క్ ను మరో 50 ఎకరాలు విస్తరించి మీడియం జూ పార్క్ గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్, అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చీఫ్ విప్ తెలిపారు.

400 రకాల పై చిలుకు వన్యప్రాణులు ఉన్న ఈ జూపార్క్ ను హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జూ పార్క్ గా హనుమకొండ జూ పార్కును తీర్చిదిద్దడంలో అధికారుల సమిష్టి కృషి ఉండాలని సూచించారు. ఎనిమల్ అడాప్షన్ స్కీంలో భాగంగా ఎలుగుబంటిని దత్తత తీసుకున్న ఎన్ఆర్ఐ పుల్ల సుభాష్ ను దాస్యం వినయ్ భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు, జూపార్క్ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.