తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా

తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లాపరకాల : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన నియోజకవర్గం పరకాలలోని పలు ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 66.10లక్షలతో నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

వాటిలో రూ. 12.60 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక, రూ.2.50 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డ్, రూ. 5.00 లక్షలతో నిర్మించిన పల్లె ప్రకృతివనం, రూ.46.00 లక్షలతో నిర్మించిన బృహత్ పల్లె ప్రకృతివనంలను చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించిన సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.