హంతక ముఠా అరెస్ట్

హంతక ముఠా అరెస్ట్హనుమకొండ జిల్లా : భూమిని విక్రయించడంలో అడ్డు పడుతున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధంతో పాటు బాధితుడికి చెందిన 3 గ్రాముల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి తెలిపారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ జిల్లా రంగశాయిపేట రాంగోపాల్ పూర్ కు చెందిన ఎండి అక్బర్, ఎనుమాముల మార్కెట్ బాలాజీనగర్ కు చెందిన ఎండి అజ్ఞర్, హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన బండ జీవన్ రెడ్డి, తౌటం వంశీకృష్ణ, బుర్ర అనిల్, వరంగల్ మట్వాడాకు చెందిన ఎస్కే సైలానీ గా పోలీసులు గుర్తించారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి, కాజీపేట ఏసిపి శ్రీనివాస్, హసనపర్తి ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రావు, ఎస్.ఐలు విజయ్ కుమార్, సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు – క్రాంతికుమార్, సతీష్, నగేష్,హోంగార్డ్ శ్రీనివాస్ లను సీపీ తరుణ్ జోషి అభినందించారు.