ర్యాంగింగ్ ఘటనలో 6గురు స్టూడెంట్స్ సస్పెండ్

ర్యాంగింగ్ ఘటనలో 6గురు స్టూడెంట్స్ సస్పెండ్హైదరాబాద్ : సూర్యాపేట మెడికల్ కాలేజీలో రెండ్రోజుల క్రితం జరిగిన ర్యాగింగ్ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో 2019-2020 బ్యాచ్ కు చెందిన ఆరుగురు విద్యార్థులను యేడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ నుంచి ఆ ఆరుగురిని శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారంటూ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఒంటిపై దుస్తులు తొలగించి ఫోటోలు తీశారని, ట్రిమ్మర్ తో జుట్టు తొలగించేందుకు సీనియర్లు యత్నించారని బాధిత విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీనియర్ ల నుంచి తప్పించుకున్న సదరు విద్యార్థి తనకు జరిగిన అవమానాన్ని ఫోన్ లో తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో విద్యార్థి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు.