సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభం

సైబరాబాద్ లో ఆపరేషన్ స్మైల్ VIII ప్రారంభంహైదరాబాద్ : నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో మంగళవారం ఆపరేషన్ స్మైల్ VIII సమీక్ష సమావేశం జరిగింది. వివిధ స్టేక్ హోల్డర్లైన జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు టీం, బచ్ పన్ ఆందోళన్, పోలీసుల సమన్వయ సమావేశంలో పాల్గొని చిన్నారులను రక్షించే విషయమై ఆయన చర్చించారు. ప్రతీ సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ ఉంటుందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ VIII సమీక్ష సమావేశంలో ముఖ్యంగా చిన్నారులను ఎలా రక్షించాలనే అంశాలను చర్చించారు.

ఇందులో భాగంగా 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను ర్యాగ్ పికర్స్, వీధి బాలలను రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ కు తరలిస్తామన్నారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయ కారణాల వల్ల బాలలు అణచివేతకు గురవుతున్న వారిని రెస్క్యూ చేసేందుకు కావాల్సిన సిబ్బందిని మరియు సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ లో పనిచేస్తున్న సిబ్బందికి అదనపు టీఏలు అందిస్తామని తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి రివార్డులను అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ వుమెన్ అండ్ చిల్డ్రన్స్ సేఫ్టీ వింగ్ డిసిపి అనసూయ, సీడబ్ల్యూసీ చైర్మన్ రాజారెడ్డి, బచ్పన్ బచావో ఆందోళన్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.