హుస్నాబాద్ సీటు సీపీఐకేనా ? 

హుస్నాబాద్ సీటు సీపీఐకేనా ?

హుస్నాబాద్ సీటు సీపీఐకేనా ? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఒడితెల సతీశ్ కుమార్ ఇక్కడ్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారాయన. అయితే ఈసారి మాత్రం ఆయనకు గులాబీ పార్టీ టికెట్ దక్కేఅవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కమ్యూనిస్టులకు పొత్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ వేగం పెంచిన తరుణంలో కచ్చితంగా సీపీఐ, సీపీఎంతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ లెక్కల ప్రకారం చూస్తే సీపీఐ, సీపీఎంకు కొన్ని స్థానాలు ఇచ్చేందుకు కేసీఆర్ కూడా సుముఖంగా ఉన్నారని టాక్.

బీఆర్ఎస్ కామ్రేడ్లకు ఇవ్వడానికి అంగీకరించే అసెంబ్లీ స్థానాల లిస్టులో హుస్నాబాద్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ సీపీఐకి బలమైన ఓటుబ్యాంకు ఉంది. సీపీఐ అగ్రనేత చాడ వెంకటరెడ్డి గతంలో ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు కూడా గుసగుసలాడుకుంటున్నారు.హుస్నాబాద్ సీటు సీపీఐకేనా ? సిట్టింగ్ స్థానమైన హుస్నాబాద్ ను సీపీఐకి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని కామ్రేడ్లు చెప్పుకుంటున్నారు. ఆదిశగా ఇప్పటికే నియోజకవర్గంలో సీపీఐ నేతలు యాక్టివ్ అయిపోయారు. పొత్తులో భాగంగా ఈసారి హుస్నాబాద్ లో సీపీఐ పోటీ చేయడం ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే వేరే వాళ్లు అయితే పెద్దగా చర్చ జరిగే అవకాశం ఉండేది కాదు. కానీ ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వొడితెల సతీశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అందులోనూ సీఎం కేసీఆర్ కు ఎంతో సన్నిహితుడైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుమారుడే సతీశ్ కుమార్. కాబట్టి తన స్నేహితుడి కుమారుడికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వకుండా ఉంటారా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. అందుకే నియోజకవర్గంలో అన్ని పార్టీలు సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాయోనని ఎదురుచూస్తున్నాయి.

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సీరియస్ గా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ సీటు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సతీశ్ కుమార్ కు టికెట్ మిస్ అయితే ఎమ్మెల్సీ హామీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. ఆదిశగా సతీశ్ కుమార్ కు ఇప్పటికే సిగ్నల్స్ ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దానికి ఆయన రియాక్షన్ ఏంటన్నది మాత్రం క్లారిటీ లేదు.

హుస్నాబాద్ లో గత రెండు దశాబ్దాల చరిత్రను చూస్తే ఏ ఎమ్మెల్యే కూడా వరుసగా మూడుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. అయితే అంతమాత్రాన సతీశ్ కుమార్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. పార్టీపరంగానూ ఆయనకు అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈసారి కామ్రేడ్లతో పొత్తు ఆయనకు ఇబ్బందిగా మారనుంది. అందుకే సతీశ్ కుమార్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ్నుంచి సీపీఐ అభ్యర్థిగా చాడ వెంకటరెడ్డి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా. మరి ఎన్నికల వరకు ఏమైనా ఊహించని మార్పులు జరుగుతాయా? సతీశ్ కుమార్ కు బీఆర్ఎస్ టికెట్ వస్తుందా? లేక సీపీఐ తరపున చాడ వెంకటరెడ్డి బరిలో ఉంటారా? అన్నది వేచి చూడాలి.